Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరు నగర పాలక మేయర్ కుర్చీలో మహిళ

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (14:47 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైకాపా క్వీన్ స్వీప్ చేసింది. మొత్తం 50 స్థానాలకు గాను 47 డివిజన్లలో వైకాపా మేయరు విజయభేరీ మోగించారు. మూడు స్థానాలను టీడీపీ సభ్యులు గెలుచుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ మేయర్‌గా వైకాపా మహిళా నేత షేక్ నూర్జహాన్‌ ఎన్నికయ్యారు. ఆమె శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నూర్జన్‎హాన్‎తో పాటు డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస్, సుధీర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు కార్పొరేషన్‌ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 
 
అయితే, మేయర్‌గా నూర్జాహాన్‌ను ఎంపిక చేయడం ఇపుడు చర్చనీయాశంగా మారింది. అసలు ఎవరీ నూర్జాహాన్ అంటూ ఆరా తీస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోను ఆమె ఐదేళ్లపాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా మేయర్‌గా కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 
 
ఈసారి కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ తరపున 50వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు మొత్తం నగర పంచాయతీ ఎన్నికలను భుజాన వేసుకున్నారు. అనేక డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పెదబాబు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. 
 
సీఎం జగన్‌ ఆశీస్సులతో నూర్జహాన్‌ ఎన్నికల ముందు నుంచే మేయర్‌ అభ్యర్థిగా ఖరారయ్యారు. చివరకు అదే ప్రక్రియ కొనసాగింది. ఈ మధ్యలో కొన్ని కొన్ని అపోహలు పెద్ద ఎత్తున ప్రచారం సాగినా అవన్నీ వీగిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments