Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు నా కూతురులాంటిదానివి... ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని లైంగికదాడి...

నీవు నాకు కుమార్తెలాంటిదానివమ్మా... రా... నా ఒడిలో కూర్చో.. అంటూ ఓ చిన్నారిని ప్రేమగా పిలిచి లైంగిక దాడి చేస్తూ వచ్చాడో తండ్రి వయసున్న కామాంధుడు. ప్రేమగా దగ్గరికి పిలిచి తల నిమురుతూ బాగా చదువుకో అంటూ

Webdunia
బుధవారం, 27 జులై 2016 (09:48 IST)
నీవు నాకు కుమార్తెలాంటిదానివమ్మా... రా... నా ఒడిలో కూర్చో.. అంటూ ఓ చిన్నారిని ప్రేమగా పిలిచి లైంగిక దాడి చేస్తూ వచ్చాడో తండ్రి వయసున్న కామాంధుడు. ప్రేమగా దగ్గరికి పిలిచి తల నిమురుతూ బాగా చదువుకో అంటూ పొగిడేవాడు. శరీరంపై నిమురుతుంటే గ్రహించలేకపోయింది. అమాయకంగా అతడి చేతిలో మోసపోయింది. రెండు నెలలుగా లైంగికదాడితో చిత్ర హింసలకు గురిచేస్తున్నా భరించింది. 
 
తల్లిదండ్రులకు చెబితే ఆ దుర్మార్గుడు తనను ఎక్కడ బలితీసుకుంటాడోనన్న భయం చిన్నారి నోటిని కట్టిపడేసింది. రోజు రోజుకు అతడి వేధింపులు పెరగడంతో ఆందోళన చెందింది. వారం రోజులుగా దుర్మార్గుడికి దూరంగా ఉంటూ వచ్చింది. ఇది భరించలేని అతడు వీడియోలున్నాయని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో తట్టుకోలేకపోయింది. ఈ దారుణం హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఆశీర్వాదం పెయింటర్‌. ఏడాది క్రితం ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఇంటి యజమాని కుమార్తె(15)పై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. రెండు నెలలుగా బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. వీడియోలు ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. ఆవేదన చెందిన ఆమె తల్లికి విషయం చెప్పింది. జూబ్లీహిల్స్‌ పోలీసులకు తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. 376 క్లాస్‌ 2 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం