Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నానదిలో ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతు

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:12 IST)
పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన కడప జిల్లా సిద్ధవటం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతిలోకి కోరగుంటకు చెందిన కొందరు యువకులు కడప జిల్లాకు విహార యాత్రకు వెళ్లారు. 
 
ఆ తర్వాత సిద్ధవటంలో పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఏడుగురు గల్లంతయ్యారు. ఈత కొడదామని నదిలో దిగి, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారని వివరించారు.
 
ఈ విషయాన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు పిలిపించి నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
గల్లంతైన వారు తిరుపతిలోకి కోరగుంటకు చెందిన వారని గుర్తించారు. ఇప్పటివరకు ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 
పెన్నానదిలో గల్లైంతనవారిని తిరుపతి సమీపంలోని కోరగుంట నుంచి సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ అనే యవకులుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments