Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మిలియన్ మార్చ్''‌ ఉద్రిక్తత: తెలంగాణ సర్కారుకు వణుకు.. కోదండరాం

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ''మిలియన్ మార్చ్''‌కు అప్పట్లో లక్షలాది జనం తరలివచ్చారు. తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. అయితే మిలియన్‌ మార్చ్‌ను గుర్తు చేసుకునే దిశగా ట్యాంక్‌బండ్‌పై శని

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (13:29 IST)
తెలంగాణ ఉద్యమం సందర్భంగా ''మిలియన్ మార్చ్''‌కు అప్పట్లో లక్షలాది జనం తరలివచ్చారు. తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. అయితే మిలియన్‌ మార్చ్‌ను గుర్తు చేసుకునే దిశగా ట్యాంక్‌బండ్‌పై శనివారం తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
 
తెలంగాణ జేఏసీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ చీఫ్ తెలంగాణ సర్కారుపై నిప్పులు చెరిగారు. 
 
శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సోయిలోకి వస్తే ప్రశ్నిస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్లనీయకుండా వేలాది మంది జేఏసీ నాయకులను అరెస్ట్‌ చేశారని, తన ఇంటిని పూర్తిగా పోలీస్ దిగ్భందంలో ఉంచారని చెప్పుకొచ్చారు.
 
జేఏసీ నేతలను ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో నిర్భధించారని.. అరెస్టయిన వారికి కనీసం తిండి కూడా పెట్టలేదని ఫైర్ అయ్యారు. జేఏసీ నేతల అరెస్టులపై కోర్టుకెళ్తామని కోదండరాం తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ప్రజాకాంక్షను చాటుతామని స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వకపోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. నాటి మిలియన్ మార్చ్ జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయని కోదండరాం చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments