Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (10:45 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్ ఏర్పాటుకానుంది. ఇందుకోసం రూ.250 కోట్ల వ్యయం చేశారు. ఈ సెంటర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతం తెలిపింది. ఈ టెక్ సెంటర్ నిర్మాణం కోసం అవసరమైన 20 ఎకరాలను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ సెంటర్‌ను కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలని గత వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇపుడు ప్రభుత్వం మారడంతో ఈ సెంటర్‌ను అమరావతిలోనే నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 
 
అమరావతిలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలోని 20 ఎకరాల భూమిని సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన తొలి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో గుంటూరు జిల్లాలో మరో సెంటర్ను ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
 
నిజానికి తొలుత దీనిని కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేయాలని అప్పటి జగన్ ప్రభుత్వం కోరింది. అయితే, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు దీనిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ప్రపంచస్థాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్‌తోపాటు వివిధ ఇంజినీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాములు అందిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments