Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేత : డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన ఎస్ఈసీ

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (08:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం నిలిపివేసింది. ప్రజారోజ్యం దృష్ట్యా ఈ షెడ్యూలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఎస్ఈసీ తరపు న్యాయవాది తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా సెలవులు ఉన్నందున, అత్యవసర పిటిషన్‌గా భావించి విచారణ జరపాలని డివిజన్ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు.
 
అంతకుముందు, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ నిర్ణయం సరికాదని పేర్కొంది.
 
ఏపీ సర్కారుకు ఊరట.. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఆదేశాలు ఏపీ సర్కారుకు ఊరట కలిగించేలా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌కు అంతరాయం కలగరాదనీ, ప్రజాసంక్షేమం దృష్ట్యా వీటిని నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఇటీవల ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డొస్తాయని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేశామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
 
విచారణ సందర్భంగా ఎస్ఈసీ నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, స్థానిక ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం కష్టసాధ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ రిలీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments