Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పాల త‌యారీలో డిజిట‌ల్ టెక్నాల‌జీ... మంత్రి అఖిల ప్రియ‌ను క‌లిసి వివ‌రించిన శిల్పులు

అమ‌రావ‌తి: శిల్పాల త‌యారీలో ఇపుడు డిజిట‌ల్ టెక్నాల‌జీ ముఖ్య పాత్ర పోషిస్తోంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఎన్ని వంద‌ల అడుగుల విగ్ర‌హాలు అయినా, శిల్పులు త‌మ ప్రావీణ్యానికి సాంకేతిక‌త జోడించి త‌యారుచేసే కొత్త విధానాలు

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (21:52 IST)
అమ‌రావ‌తి:  శిల్పాల త‌యారీలో ఇపుడు డిజిట‌ల్ టెక్నాల‌జీ ముఖ్య పాత్ర పోషిస్తోంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఎన్ని వంద‌ల అడుగుల విగ్ర‌హాలు అయినా, శిల్పులు త‌మ ప్రావీణ్యానికి సాంకేతిక‌త జోడించి త‌యారుచేసే కొత్త విధానాలు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ల్ల రామేశ్వ‌రానికి చెందిన శిల్ప క‌ళాకారుల బృందం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో మంత్రి భూమా అఖిల ప్రియ‌ను క‌లిసింది. తాము డిజిట‌ల్ టెక్నాల‌జీతో త‌యారు చేసిన ఎన్టీఆర్ ఫైబ‌ర్ విగ్ర‌హాన్ని మంత్రికి రాష్ట్ర శిల్పి స‌మాఖ్య అంద‌జేసింది. 
 
ఈ సంద‌ర్భంగా స‌మాఖ్య రాష్ట్ర అధ్య‌క్షుడు త‌మ శిల్పుల స‌రికొత్త సాంకేతిక‌ను మంత్రికి వివ‌రించారు. ఒక అడుగు నుంచి వెయ్యి అడుగుల వ‌ర‌కు ఫైబ‌ర్, పంచలోహ, కంచు విగ్ర‌హాల‌ను డిజిట‌ల్ స్కానింగ్ ప‌ద్ధ‌తిలో ఎలా నిర్మిస్తారో ట్యాబ్ ద్వారా వివ‌రించారు. హైద‌రాబాదులోని ట్యాంక్ బండ్ పైన శ్రీకృష్ణదేవ‌రాయ‌లు, అన్న‌మ‌య్య‌, టంగుటూరి ప్ర‌కాశం పంతులు, త్రిపుర‌నేని రామ‌స్వామి త‌దిత‌ర  విగ్ర‌హాల‌ను తామే నిర్మించామ‌ని మంత్రికి రాష్ట్ర శిల్పి స‌మాఖ్య అధ్య‌క్షుడు పి.అరుణ్ ప్ర‌సాద్ ఉద‌యార్ వివ‌రించారు. ఆళ్ళ‌గ‌డ్డ‌లో స్వ‌ర్గీయ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల 25 అడుగుల విగ్ర‌హాల‌ను తాము డిజిట‌ల్ టెక్నాల‌జీతో నిర్మించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. శిల్ప క‌ళాకారుల ప్ర‌తిభ‌ను మంత్రి భూమా అఖిల ప్రియ అభినందించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments