Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌పై యాసిడ్ పోసిన వ్యక్తి.. ట్యుటోరియల్‌లో ట్యూషన్ చెప్తుండగా?

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లో

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:41 IST)
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 49 ఏళ్ల ఉప్పులూరి సూర్యకుమారి, లక్ష్మీనారాయణ దంపతులు స్థానిక పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నారు.
 
సూర్యకుమారి చింతల్ కాకతీయ నగర్‌లోని సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతలో ఓ గది అద్దెకు తీసుకుని ట్యుటోరియల్ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ట్యూషన్ చెబుతుండగా రాత్రి 7:30 గంటల సమయంలో ముఖానికి కర్చిఫ్ కట్టుకుని వచ్చిన  గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వెంటనే స్థానికులు కూకట్ పల్లిలోని రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments