Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో బోల్తా పడిన కృష్ణవేణి స్కూల్ బస్సు.. చిన్నారుల పరిస్థితి ఏంటి?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (13:37 IST)
గుంటూరులో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. 50 మంది విద్యార్థులతో కూడిన ఈ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో వారి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. మరో 25మంది విద్యార్థులు గాయపడ్డారు. అయితే ప్రాణ నష్టం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని మాచర్ల నుంచి 50 మంది విద్యార్థులతో కూడిన స్కూల్ బస్సు మండాడి వాగు వద్ద ఎదురుగా వేరే వాహనం రావడంతో కంగారుపడి స్కూల్ బస్సు డ్రైవర్ దాన్ని తప్పించేందుకు స్టీరింగ్ బలంగా పక్కకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టు నుంచి వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడిందని పోలీస్ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. 
 
కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌‌కు సంబంధించి బస్సే ఈ ప్రమాదానికి గురైందని.. బస్సు లోయలో పడగానే స్థానికులు విద్యార్థులను రక్షించారు. అంతలో సహాయక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. బస్సును నడిపే సమయంలో డ్రైవర్ మద్యం సేవించి వున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments