Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

ఠాగూర్
బుధవారం, 23 జులై 2025 (11:58 IST)
గత వైకాపా ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన కారు డ్రైవర్‌ను హత్య చేసి మృృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఇంటికి డోర్ డెలివరీ చేసిన కేసును మళ్లీ విచారించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ, 90 రోజుల్లో అనుబంధ (సప్లిమెంటరీ) అభియోగపత్రం దాఖలు చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సింగవరపు ఉమా సునంద మంగళవారం ఆదేశాలిచ్చారు. 
 
వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి పోలీసు అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయకుండా కేవలం ఎమ్మెల్సీ అనంతబాబునే నిందితుడిగా చేర్చారని.. ఇందులో మరింతమంది పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో విన్నవించారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. 
 
దంతో రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతోపాటు, ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న విచారించిన న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసు మళ్లీ మొదటి నుంచి విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments