Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (08:58 IST)
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి, మరికొందరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

దళితుడినైన తనను కులం పేరుతో దూషించారని ఎమ్మెల్యే వర్గీయుడు మనోజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తాడిపత్రి పోలీసులు శుక్రవారం వారిద్దరితోపాటు సోమశేఖర్‌నాయుడు, రఘునాథరెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, లోకనాథ్‌రెడ్డి, వేలూరు రంగయ్య, తిరుపాలురెడ్డి, ఖదీర్‌, త్రినాథ్‌రెడ్డి, మరికొందరిపైన 147, 148, 506, 307ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ, సెక్షన్‌ 3(1)(ఆర్‌)(ఎస్‌) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
 
ఎమ్మెల్యే కుటుంబసభ్యులు బండి ఇసుకకు రూ.10వేలు వసూలు చేస్తున్నారని సోషల్‌ మీడియాలో ఆడియో రికార్డును వైరల్‌ చేసిన జేసీ మద్దతుదారులు వలీ, కులశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌నాయుడులపై సుమోటోగా కేసులుపెట్టారు. అయితే జేసీ ఇంట్లో జరిగిన ఘర్షణకు  సంబంధించి కేతిరెడ్డి, ఆయన అనుచరులపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు.

ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేస్తే తప్ప.. కేసులు పెట్టబోమని పోలీసులు అంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రెడ్డి మాత్రం ఫిర్యాదు ఇచ్చే ప్రసక్తే లేదని.. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వారే సుమోటోగా కేసు నమోదు చేయాలని పట్టుబడుతున్నారు.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో వీరంగం చేయడం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments