Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌‌ బెయిల్ రద్దయ్యేనా? సుప్రీం కోర్టు నోటీసులు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (13:40 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు భయం ప్రారంభమైంది. తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అదేసమయంలో సీబీఐతో పాటు జగన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 
 
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం తెలిపింది. జగన్‌తో పాటు సీబీఐ ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపు, విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్‌లో రఘురామ కోరారు. దీనని పిటిషన్‌‍కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇపుడే రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించగా, తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురామరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments