Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులున్నారు.. జాగ్రత్త.. పాయసంలో మత్తుమందు కలిపి?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (14:35 IST)
ఇదేంటి అనుకుంటున్నారా? ప్రసాదంలో మత్తుమందు కలిపి.. నగలు దోచుకున్న ఓ కిలేడీ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహం చేద్దామని.. నమ్మకం ఏర్పడేలా చేసి.. ఆపై బంగారాన్ని దోచుకున్న మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారం సత్యనారాయణపురం పోలీస్టేషన్‌ పరధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అబ్బూరివారి వీధికి చెందిన సత్యవాణి ఎక్కువగా ఆలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో స్థానిక శివాలయంలో ముప్పాళ్ల ఆదిలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా బలపడింది. 
 
ఒకరింటికి ఒకరు రావడం పోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. తనకు ఇదే ప్రాంతంలో అద్దెకు ఇల్లు కావాలని ఆదిలక్ష్మి కోరగా.. సత్యవాణి తన గృహానికి సమీపంలోనే ఇల్లు ఇప్పించింది. పౌర్ణమి సందర్భంగా తమ ఇంటికి భోజనానికి రావాలంటూ ఆదిలక్ష్మి.. సత్యవాణిని ఆహ్వానించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం వెళ్లింది. ఆదిలక్ష్మి పులిహోర, పాయసం ఇతర రుచికరమైన ఆహారాన్ని వడ్డించింది. 
 
అది తిన్న నిముషాల వ్యవధిలోనే సత్యవాణి స్పృహ తప్పిపడిపోయింది. కొద్దిసేపటికి తేరుకొని చూసుకునే సరికి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం మాయమైంది. మోసపోయామనే విషయాన్ని తెలుసుకుని.. భర్తతో పాటు సత్యవాణి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారంలో మత్తు మందు కలిపి, 20కాసుల బంగారం చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments