య‌ధేచ్ఛ‌గా కోడి పందాలు, గుండాట‌! అధికారం మాది...త‌గ్గేదేలా!

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (14:23 IST)
గ్రామాల్లో సంక్రాంతి వేడుక‌లు జోరుగా సాగుతున్నాయి. ఎక్క‌డిప‌డితే అక్క‌డ కోడి పందాల బ‌రులు వెలిశాయి. పోలీసులు ముందు హూంక‌రించినా, త‌ర్వాత వ‌దిలేసిన‌ట్లు క‌నిపిస్తోంది. పైగా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ అధికార వైసీపీ నేత‌లు ద‌గ్గ‌రుండి సంక్రాంతి సంబ‌రాలు జ‌రిపిస్తున్నారు. త‌గ్గేదేలా అంటూ, బ‌రులు గీసి కోడి పందాలు, పేకాట‌, గుండాట‌, జూదం న‌డిపించేస్తున్నారు.
 
 
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో యద్దేచగా కోడిపందాలు, జూదం, మద్యం ప్ర‌వ‌హిస్తున్నాయి. వైసిపి నేతల అండ‌తో జోరుగా కోడి పందాలు నిర్వ‌హిస్తున్నారు. పోలీసులకు ముడుపులు ఇచ్చాం...ప్రభుత్వం మాది అంటున్నారు వైసిపి నేతలు. అందుకే, ఎవరూ వచ్చినా తగ్గేదెలా అంటున్నారు పందెంరాయుళ్లు. 

 
ఇక హైటెక్ ప‌ద్ధ‌తుల్లో కోడి పందాలు వీక్షించేందుకు సీసీ కెమెరాలు, టీవీలు కూడా ఏర్పాటు చేసి, ఇబ్రహీంపట్నం పందెం రాయ‌ళ్ళు సంద‌డి చేస్తున్నారు. ఇంత హైటెక్ ప‌ద్ధ‌తుల్లో కోడి పందాలు వేస్తున్నా, బ‌హిరంగంగా గుండాట‌, పేకాట‌లు ఆడుతున్నా పోలీసులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments