Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాకు సంపూర్ణేష్ బాబు మద్దతు.. 26న వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో కలుద్దాం..

ప్రత్యేక హోదా సాధన కోసం యువత ఆందోళన బాట పెట్టింది. పవన్ కల్యాణ్ స్పందించడం ద్వారా సినీ రంగం నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా హీరో సంపూర్ణేష్ బాబు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అయినప్పటికీ ఏపీ యూ

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (12:04 IST)
ప్రత్యేక హోదా సాధన కోసం యువత ఆందోళన బాట పెట్టింది. పవన్ కల్యాణ్ స్పందించడం ద్వారా సినీ రంగం నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా హీరో సంపూర్ణేష్ బాబు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అయినప్పటికీ ఏపీ యూత్ చేపట్టిన నిరసన కార్యమానికి మద్దతుగా ట్వీట్స్ పెడుతుండటం విశేషం. అయితే ఏపీ యూత్ మాత్రం కేవలం ట్వీట్స్ పెడితే సరిపోదని, తమిళ హీరోల్లాగా తెలుగు హీరోలంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.
 
ఈ డిమాండ్‌పై సంపూర్ణేష్ బాబు స్పందించాడు. వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న జరగబోయే హోదా సాధన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశాడు. వైజాగ్‌కు టికెట్ కూడా కన్ఫార్మ్ అయినట్లు సంపూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 26న ఆర్కే బీచ్‌లో కలుద్దామన్నాడు. ప్రత్యేక హోదాపై పవన్ నినాదాన్ని సంపూ మరోసారి ట్వీట్ చేశాడు. 
 
తాను ఏ రాజకీయ పార్టీకి మద్ధతు తెలపడం లేదని, యువత చేస్తున్న పోరాటానికే తాను సపోర్ట్ చేస్తున్నానని సంపూర్ణేష్ బాబు చెప్పాడు. అయితే ఈ కార్యక్రమానికి మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. 
 
ఇదిలా ఉంటే.. తనవల్లే బీజేపీ గెలిచిందని చెప్పుకుంటున్న పవన్, ప్రత్యేక హోదా సంగేతేంటని ప్రధాని మోడీనే అడగొచ్చు కదా అని మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఏఎస్‌ రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనగణమన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ జగన్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని అన్నారు. జగన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments