రెడ్ బుక్‌ను లైట్‌గా తీసుకున్నాం.. 2 నెలల్లో మేమంతా జైలుకే : సజ్జల రామకృష్ణారెడ్డి

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (09:29 IST)
టీడీపీ చెప్పుకుంటూ వచ్చిన రెడ్ బుక్‌ను తాము లైట్‌గా తీసుకున్నామని, ఈ కారణంగా మరో రెండు నెలల్లో మేమంతా జైలుకు వెళతామని వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మా అందరిపై కేసులు ఉన్నాయని, మహా అయితే, మరో రెండు నెలలు లేదా ఎపుడైనా జైలుకు పోవచ్చన్నారు. అవినీతి కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో శనివారం సజ్జల ములాఖత్ నిర్వహించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు మేం అధికారంలోకి వస్తే రెడ్ బుక్ పాలన ఉంటుందని పదేపదే చెప్పారని, ఆ మాటలను తాము లైట్‌గా తీసుకున్నామన్నారు. దాని పర్యావసానాలు ఇంత తీవ్రంగా ఉంటాయని ఇపుడు చూస్తున్నామన్నారు. కల్పిత కథలు సృష్టించి, వైకాపా నేతల పాత్రలు చేర్చి కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారన్నారు.
 
సోషల్ మీడియాతో మొదలై ఇపుడు పరాకాష్టకు చేరిందన్నారు. కాకాణి బలంగా మాట్లాడుతున్నపుడే ఆయనను టార్గెట్ చేస్తారని భావించామని, ఇపుడు తాము ఊహించినట్టుగానే జరిగిందన్నారు. రాష్ట్రంలో వైకాపా అనే ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని కూటమి పాలకులు చూస్తున్నారని, కానీ, ఎంత అణగదొక్కాలని చూస్తే అంత బలంగా పైకి లేస్తామని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇపుడు సీఎం చంద్రబాబు నాయుడు నాటిన విత్తనం... రేపు దాని ఫలాలు ఎలా ఉంటాయో ఆయన ఊహించడం లేదని, వైకాపా అధికారంలోకి వస్తే అవి భయంకరంగా ఉంటాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments