Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టును చంద్రబాబే ఏర్పాటు చేయాలి : సదానంద గౌడ

Webdunia
గురువారం, 26 మే 2016 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకాం ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు వెళుతుందని… కొత్తగా ఏపీకి హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 
 
ఏపీకి హైకోర్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వసతులు కల్పిస్తామని అంటోందని… అందుకు ఏపీ సీఎం అంగీకరించాలి కదా అన్నారు. అయినా ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందని, కోర్టు ఏం చేబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
 
ఈ విషయంలో ఏపీపై మీరు ఒత్తిడి చేయొచ్చు కదా అని విలేకరులు అడగ్గా… నేను ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేనన్నారు. మొత్తానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సమాధానాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి చేసినా… తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం చేయగలిగిందేమీ లేదని తేటతెల్లమైపోయింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments