Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్: సచిన్ ట్వీట్‌కు 20 లక్షల హిట్లు

దేశ ప్రజలకు మేలు చేసే ఒక మంచి కార్యం కోసం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన ఒక ట్వీట్ 20 లక్షల హిట్లకు పైగా సాధించడం విశేషం. అది కూడా హైదరాబాద్‌లో హెల్మెట్ ధరించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్న వారిని ఉద్దేశించి సచిన్ చేసిన హితవుకు తన అభిమానులు నీ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (06:07 IST)
దేశ ప్రజలకు మేలు చేసే ఒక మంచి కార్యం కోసం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన ఒక ట్వీట్ 20 లక్షల హిట్లకు పైగా సాధించడం విశేషం. అది కూడా హైదరాబాద్‌లో హెల్మెట్ ధరించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్న వారిని ఉద్దేశించి సచిన్ చేసిన హితవుకు తన అభిమానులు నీరాజనం సమర్పించారు. ఏప్రిల్ 5న ఐపీఎల్ 10 సీజన్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ చూడటానికి సచిన్ విచ్చేసిన సందర్భంగా ఈ ఘటన జరగింది.
 
హైదరాబాద్ ట్రాఫిక్‌లో సచిన్ టెండూల్కర్ అనధికారికంగా ట్రాఫిక్ పాఠాలు చెప్పారు. ఏప్రిల్ 5న ఐపీఎల్ తొలి మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో సచిన్ ప్రయాణిస్తున్న కారు ఒక సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో తన పక్కనుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హెల్మెట్‌ లేకుండా వెళుతున్నారు. అది చూసి సచిన్‌ కారు విండో తీసి ‘హెల్మెట్‌ పెట్టుకోండి. జీవితం చాలా విలువైనది. ఇకముందు ఎప్పుడూ హెల్మెట్‌ లేకుండా బయటికి వెళ్లకండి. అది చాలా డేంజర్‌’ అని చెప్పారు. 
 
తర్వాత పక్కన వెళుతున్న మరో ప్రయాణికుడిని ఉద్దేశించి కూడా సచిన్ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్‌లో సచిన్ హెల్మెట్ ధారణపై చేసిన సూచనను తన కారులో ఉన్న స్నేహితుడు రికార్డు చేశాడు. ఆ వీడియోను ఇప్పుడు సచిన్ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. అది ఎంత వైరల్ అయిందంటే అతి తక్కువ కాలంలో 20 లక్షల హిట్లను సాధించింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments