Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నం ప్రభాకర్ ఆమె కాళ్లుపట్టుకున్నారా.. జైపాల్ రెడ్డి స్పందన ఏంటి?

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నాటీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ కాళ్లను నాడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ పట్టుకున్నారా లేదా అనే అంశంపై కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రె

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:11 IST)
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నాటీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ కాళ్లను నాడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ పట్టుకున్నారా లేదా అనే అంశంపై కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి స్పందించారు. 
 
విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్నారంటూ ఉండవల్లి తన పుస్తకంలో రాయడం మరీ వ్యంగ్యంగా ఉందని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. 
 
ఉండవల్లి రాసిన ‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకంలోని కొన్ని అంశాలపై ఆయన స్పందిస్తూ.. విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నాడు హౌస్ ప్రసారాలను నిలిపివేయమని తాను చెప్పలేదని అన్నారు. 
 
ప్రసారాలు నిలిపివేయడానికి, విభజన బిల్లు ఆమోదింపజేయడానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. హౌస్ ప్రసారాలను నిలిపివేయడమనేది స్పీకర్ వివేచనపై ఆధారపడి ఉంటుందన్నారు. బహుశ హౌస్‌లో పెప్పర్ స్ప్రే కొట్టినందునే, నాడు ప్రసారాలను నిలిపివేసి ఉంటారని తాను భావిస్తున్నానని జైపాల్ రెడ్డి అన్నారు.
 
కాగా, నాడు విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెల్సిందే. ఈయనే విభజన బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో సభలో పెప్పర్ స్ప్రేను ప్రయోగించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments