Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీపై ఆర్టీసీ చార్జీల భారం తప్పదు : మంత్రి శిద్దా రాఘవరావు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (15:35 IST)
సీమాంధ్ర ప్రజానీకంపై ఆర్టీసీ చార్జీల పెంపు భారం తప్పదని ఆ రాష్ట్ర రవాణా మాత్రం శిద్ద రాఘవరావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ యేడాదికి రూ.600 కోట్ల నష్టంలో నడుస్తోందని.. నష్టాల నుంచి గట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. 
 
ఏపీఎస్ ఆర్టీసీని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించినట్టు వివరించారు. చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రికి నివేదిస్తామని, తుది నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారని తెలిపారు. ఆర్టీసీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను లీజుకు ఇచ్చే విషయాన్ని సైతం చర్చించామని తెలియజేశారు.
 
కాగా, ఆర్టీసీ నిర్వహణపై విజయవాడలోని ఆర్టీసీ భవనంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments