Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ స్మారక నాణెం చెలామణిలోకి వస్తుందా?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (10:55 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన స్మారకార్థం రూ.100 నాణెంను కేంద్రం విడుదల చేసింది. ఈ నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఈ నాణెం నుంచి రాష్ట్ర ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. 
 
రాష్ట్రపతి భవన్‍లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొనగా, వారి సమక్షంలో ఎన్టీఆర్ స్మారక నాణెంను విడుదల చేశారు. అయితే, ఈ నాణెం చెలామణిలోకి వస్తుందా రాదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ స్మారక నాణెం హైదరాబాద్‌లోని మింట్‌లో తయారైంది. దీనికి సంబంధించి మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మింట్లో తొలిసారి ఓ వ్యక్తి చిత్రంతో నాణేం ముద్రించినట్టు చెప్పారు. అయితే ఇది మార్కెట్లో చలామణి కోసం కాదని స్పష్టం చేశారు. 
 
తొలి విడతగా 12 వేల స్మారక నాణేలు ముద్రించామని, వీటి ధర రూ.3,500 నుండి రూ.4,850 వరకు ఉందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా, హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈ నాణేలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేస్తామన్నారు. ఇదిలావుంటే, ఈ కాయిన్‌ను మంగళవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments