Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బంగారు అనూషను పొట్టనబెట్టుకున్నాడు... అందుకే, కిరాయి హంతకులతో రాజేష్ మర్డర్

హైదరాబాద్ నగరంలో కరుడు గట్టిన నేరస్తుడు గుంటి రాజేశ్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్ మామ కావడం గమనార్హం. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసినందుకు కక్షగట్టిన మామ.. రాజేష్‌ను

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (13:30 IST)
హైదరాబాద్ నగరంలో కరుడు గట్టిన నేరస్తుడు గుంటి రాజేశ్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్ మామ కావడం గమనార్హం. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసినందుకు కక్షగట్టిన మామ.. రాజేష్‌ను కిరాయి మనుషులతో దారుణంగా హత్య చేయించాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. పోలీసుల కథనం మేరకు రౌడీ షీటర్ రాజేష్ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
హైదరాబాద్ నగరంలో పేరు మోసిన రౌడీ గుంటి రాజేశ్ చలామణి అవుతున్నాడు. ఇతనికి చెందిన ఓ వెంచర్‌లో సైదాబాద్‌కు చెందిన మామిడి శ్యాంసుందర్‌ రెడ్డి ఓ ప్లాటును కోనుగోలు చేశాడు. ఈ వ్యవహారంలో శ్యాంసుందర్‌ రెడ్డి తరుచూ రాజేశ్‌ను కలిసేవాడు. ఈ క్రమంలో శ్యాంసుందర్‌ రెడ్డి కూతురు అనూషా రెడ్డితో రాజేష్‌కు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది.
 
అయితే అప్పటికే కూతురుకు వేరే సంబంధాలు చూస్తున్న శ్యాంసుందర్‌ రెడ్డి ఈ పెళ్లికి అంగీకరించలేదు. కానీ, రాజేష్‌నే పెళ్లి చేసుకోవాలని గట్టిగా పట్టుబట్టిన అనూష... ఇంట్లో నుంచి పారిపోయి రాజేష్‌ను పెళ్లి చేసుసుంది. ఆ తర్వాత రాజేశ్‌కు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలుసుకుని.. తాను మోసపోయానని గ్రహించి పుట్టింటికి తిరిగి వచ్చేసింది. 
 
ఆ తర్వాత కొన్ని రోజులకు స్నేహితులతో కలిసి అనూషను గ్రీన్‌హిల్స్‌ కాలనీ నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లిన రాజేశ్‌ నాగపూర్‌, ఢిల్లీ, గోవాతో పాటు కేరళకు తీసుకెళ్లాడు. అతడి వల నుంచి తప్పించుకుని వచ్చిన అనూష చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కొన్నాళ్లకే అనూష అనుమానాస్పద స్థితిలో నాగార్జునసాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
 
దీంతో శ్యాంసుదర్ రెడ్డి కుమిలిపోయాడు. రాజేష్ వల్లే తన కుమార్తె జీవితం నాశనమైందని కక్ష పెంచుకుని, కిరాయి హంతకులతో ఈ హత్య చేయించినట్లు తెలిసింది. దీంతో ప్రధాన నిందితుడు సైదాబాద్‌కు చెందిన మామిడి శ్యాంసుందర్‌ రెడ్డి (48), రాజేంద్రనగర్‌కు చెందిన షేక్‌ మహ్మద్‌ (27), చిత్తూరు జిల్లా మైల్లాచెరువుకు చెందిన పొగారి దయాకర్‌ (27), అనంతపురం జిల్లా నారప్పగారిపల్లికి చెందిన కుంచపు రమణ (36) పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments