Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై రౌడీ షీటర్ రేప్.. తల్లి కళ్లముందే మూడు రోజులు.. కుక్కను కూడా?

హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కంటిముందే మూడు రోజుల పాటు యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని వారాసిగూడ పరిధిలోని అంబర్‌నగర్‌

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (18:13 IST)
హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కంటిముందే మూడు రోజుల పాటు యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని వారాసిగూడ పరిధిలోని అంబర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్ అనే రౌడీ షీటర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు దారుణంగా హింసించాడు. 
 
అడ్డుకోబోయిన యువతి తల్లిపై రౌడీ షీటర్ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత యువతి కుటుంబానికి చెందిన పెంపుడు శునకాన్ని కూడా అతడు వదిలిపెట్టలేదు. దాన్ని తీవ్రంగా కొట్టి హింసించాడు. ఈ ఘటనపై బాధితురాలు స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఇకపోతే, నిందితుడు పరారీలో వున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పరారీలో వున్న నిందితుడు.. తనపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని లేకుంటే చంపేస్తానంటూ ఫోనులో బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments