Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బాహుబలి.. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ప: రోజా

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (11:53 IST)
బాహుబలి సినిమా ఘన విజయానికి సోషల్ మీడియా ప్రధాన కారణమని చెప్పవచ్చు. బాహుబలి, భల్లాలదేవ, రుద్రసేన, కట్టప్ప, కట్టప్ప, శివగామి, కాలకేయ పాత్రలు ప్రస్తుతం బాగా పాపులర్ అయిపోయాయి. బాహుబలి మొదటి భాగం చివరిలో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడవటం అనే సీన్‌తో మంచి సస్పెన్స్‌లో సినిమా ఆగిపోవడంతో ఆ క్యారెక్టర్‌పై అనేక సెటైర్లు వాడుకలోకి వచ్చేశాయి.
 
బాహుబలి పాత్రల్లో ముఖ్యంగా కట్టప్ప పాత్రకు షీనాబోరా హత్యోదంతం బయటికి వచ్చాక రిలీఫ్ దక్కినట్లు.. బాహుబలి పాత్రలను రాజకీయ నేతలు కూడా బాగానే వాడుకుంటున్నారు. ప్రత్యేకించి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వైసీపీ నాయకురాలు రోజా.. వైకాపా అధినేత జగన్ చేపట్టిన దీక్షాస్థలం వద్ద మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలను, బాహుబలి పాత్రలను పోల్చిన తీరు ఆసక్తికరంగా ఉంది. బాహుబలి సినిమాలోని క్యారెక్టర్లతో ఆమె తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును పోల్చింది. 
 
రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ప చంద్రబాబు అని రోజా ఘాటుగా కామెంట్ చేసింది. చంద్రబాబు కాలకేయుడిలా ప్రజలపై దాడి చేస్తున్నాడని విమర్శించింది. అంతే కాదు.. భల్లాల దేవుడిలా చంద్రబాబు పాలిస్తున్నాడని కూడా కామెంట్ చేసింది. అంటే కట్టప్ప, భల్లాల దేవుడు, కాలికేయ ఈ మూడు కారెక్టర్లలోని నెగిటివ్ షేడ్స్ అన్నీ చంద్రబాబులో ఉన్నాయని చెప్పకనే చెప్పింది. జగన్ మాత్రం ప్రజలను కాపాడే బాహుబలి అని తేల్చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments