Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాజీ ఎక్స్ ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం... 25 తులాల బంగారు అపహరణ..!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (09:51 IST)
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో ప్రయాణించే రైళ్లలో భద్రత కరువైంది. పలు రైళ్లలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. తాజాగా తిరుపతి, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్న బాలాజీ ఎక్స్ ప్రెస్ రైల్లో ఆదివారం రాత్రి దోపిడీ దొంగలు పడ్డారు. 
 
కడప జిల్లా రాజంపేట మండలం హస్తవరం సమీపంలో రైలు వెళుతుండగా రైల్లోకి చొరబడిన దోపిడీ దొంగలు కత్తులతో ప్రయాణికులను బెదిరించారు. ఈ రైల్లో ఉన్న 7, 8, 9 బోగీల్లోని ప్రయాణికులపై దాడికి దిగిన దొంగలు మహిళల మెడల్లోని 25 తులాల బంగారాన్ని దోచుకున్నారు. 
 
దోపిడీ దొంగల బీభత్సంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు రైలు గుత్తిలో ఆగగానే అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments