Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్: ఓ యువకుడు మృతి.. మరో యువకుడి పరిస్థితి?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (19:55 IST)
ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇబ్రహీంపట్నం హైవే పక్కనే యువకుల ఘర్షణకు దిగారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పిడిగుద్దులతో.. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఓ యువకుడు చనిపోయాడని.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. 
 
విజయవాడ నుంచి వచ్చిన కొందరు యువకులు.. స్థానిక యువకులతో గొడవ పడ్డారని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి గ్రామ శివారులో డాక్టర్ ఎన్టీటిపీస్ బూడిద కరకట్ట నుండి మురుగు నీరు వాటర్ ఫాల్స్ తరహాలో వస్తుంటుంది. 
 
ఇటీవల కాలంలో కొంతమంది యువకులు అక్కడికి వస్తున్నారని.. సరదాగా నీటిలో ఆడుతూ ఉంటారని స్థానికులు తెలిపారు. ఆదివారం నాడు ఫ్రెండ్‌షిప్ డే, ఆదివారం కావడంతో యువకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చారు. అయితే ఊహించని విధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
ఈ ఘ‌ట‌న‌లో ఇబ్రహీంపట్నం గ్యాంగ్ వార్ కేసులో పది మంది అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. గ్యాంగ్ వార్ సభ్యుల గాలించ‌డం కోసం పోలీసులు రెండు బృందాలు ఏర్పాటుచేశామ‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments