Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గాలి" మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటు : వైకాపా ఎమ్మెల్యే రోజా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు జిల్లాకు తీరని లోటని వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు.

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:35 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు జిల్లాకు తీరని లోటని వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి గాలి ముద్దుకృష్ణమ హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతిపై రోజా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
ఇందులో... చిత్తూరు జిల్లాలోనే సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌ నాయుడు హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం దుర‌దృష్ట‌క‌రమన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప‌నిచేసిన సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ముద్దు కృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణించ‌డం చిత్తూరు జిల్లాకు తీర‌ని లోటన్నారు.
 
ఒక సాధార‌ణ ఉపాధ్యాయుడిగా ప‌నిచేసిన గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడు విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేయ‌డం ఆయ‌న జీవితంలోని అరుదైన సంద‌ర్భమన్నారు. తెలుగుదేశం పార్టీలో నేను ఆయ‌న క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, ఆరు సార్లు పుత్తూరు, న‌గ‌రి ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఆయ‌న నిరాండ‌బ‌రుడుగా పేరు తెచ్చుకున్నారనీ, అలాంటి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు అకాల‌మ‌ర‌ణానికి చింతిస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నట్టు రోజా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments