Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పాదాలపై పూలు చల్లితే మీకెందుకు అంత ఉలుకు? రోజా ప్రశ్న

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:30 IST)
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఒకవైపు ప్రజా సేవ, మరోవైపు కుటుంబంతో ఎక్కువసేపు సమయాన్ని స్ప్రెడ్ చేస్తూ రోజా ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తన సొంత డబ్బులతో పారిశుధ్య కార్మికులు, పోలీసులకు ఉచితంగా భోజనం పెట్టడంతో పాటు వారికి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు రోజా. ఇక కుటుంబ సభ్యులతో కలిసి రోజుకొక వంట చేస్తూ ఘుమఘమలాడిస్తున్నారు.
 
రోజా ప్రత్యేకంగా చికెన్ పికెల్ చేశారు. నోరూరించే పికెల్‌ను ఎలా తయారుచేయాలో చెబుతూ రోజా అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె పికెల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటికే చికెన్, ఫిష్, ఆవకాయ, వంకాయ, పుట్టగొడుగులు వంటి వంటకాలు చేసి కుటుంబ సభ్యులకు వడ్డించారు రోజా.
 
అయితే వంటలే కాదు మాటల తూటాలు పేలుస్తున్నారు రోజా. తన సొంత నియోజకవర్గం పుత్తూరులోని సుందరయ్యనగర్లో బోరు ప్రారంభోత్సవానికి వెళితే అక్కడి గ్రామస్తులకు ఆమె నడుస్తుండగా పాదాలపై పువ్వులు చల్లారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు. 
 
దీంతో చంద్రబాబునాయుడుకు అదేస్థాయిలో సమాధానమిచ్చారు రోజా. సొంత నియోజకవర్గం కుప్పంవైపు కన్నెత్తి కూడని చంద్రబాబు, ఇక మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ అక్కడి ప్రజల గురించి ఆలోచించకుండా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న నాపైనే విమర్సలు చేస్తారా అంటూ రోజా ప్రశ్నించారు. ఎన్నో యేళ్ళుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సుందరయ్యనగర్ వాసులకు బోరు వేసి ప్రారంభోత్సవానికి వెళితే అనవసర రాద్దాంతం చేస్తున్నారా అని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments