Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు సెల్ఫీలతో.. తండ్రి సెల్ఫ్ డబ్బాతో.. కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ సెటైర్

Webdunia
బుధవారం, 25 మే 2016 (08:53 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌లపై టీ టీడీపీ వర్కిగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కొడుకు సెల్పీలతో.. తండ్రి సెల్ఫ్ డబ్బాలతో ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ కంటి ముందు అభివృద్ధి.. ఇంటిముందు అభ్యర్థి అని ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను నమ్మించి బల్దియా ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్ నాయకులు ఆపత్కాలంలో ప్రజలను విస్మరించారని దుయ్యబట్టారు. ఇటీవలి గాలివానలకు భారీ హోర్డింగుల కూలినా, రోడ్లు దెబ్బతిన్నా, నాలుగు రోజులైనా కరెంటు రాకున్నా, ప్రజా జీవనం అస్తవ్యస్తమైనప్పటికీ ఏ ఒక్క మంత్రి కూడా ప్రజల వద్దకు రాలేదని విమర్శించారు 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హస్‌కు, ఆయన కొడుకు అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు. యాపిల్ సంస్థ సీఈవో నగరానికి వచ్చిన సందర్భంగా కొడుకు సెల్ఫీలతో, తండ్రి సెల్ఫ్ డబ్బాతో డంబాలు పలికినా పెద్ద ప్రాజెక్టు మాత్రం బెంగళూరుకు వెళ్లిందన్నారు. సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు తప్పయిందని ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు నుంచి రక్షిణ కల్పించలేం కానీ... వర్మకు హైకోర్టులో షాక్!

పుష్ప-2- 275 కోట్ల రూపాయలకు టీవీ రైట్స్.. నెట్‌ఫ్లిక్స్ అదుర్స్

మొన్న కిరణ్ - నిన్న వరుణ్ - నేడు విశ్వక్.. టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయారు..

ఆ కష్ట సమయంలో నా భార్య వెన్నెముకగా నిలిచింది : జానీ మాస్టర్

'పుష్ప-2' ట్రైలర్‌లో అరగుండుతో కనిపించే నటుడు ఎవరబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments