Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతి ఆయోగ్ చెప్పిందని ప్రైవేట్ పరం చేసేస్తారా? ఆర్. నారాయణమూర్తి

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (12:24 IST)
విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడివుందని, అలాంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ చెప్పడం దారుణని సినీ నటుడు ఆర్.నారాయణ మార్తి అన్నారు. నీతి ఆయోగ్ చెప్పిందనీ ప్రైవేటుపరం చేస్తారా? అని ఆయన నిలదీశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాట స్ఫూర్తితో నేడు దానిని రక్షించుకోవడానికి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అప్పట్లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాటాన్ని వివరించారు. కర్మాగారాన్ని ఎలా సాధించుకున్నదీ చెబుతూ, నాటి పోరాట ఘట్టాలను పూసగుచ్చినట్టు వివరించారు. 
 
ఈ సందర్భంగా నాటి పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకున్నారు. నేడు అదే స్ఫూర్తితో కంపెనీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నారాయణమూర్తి అన్నారు. అంతేకాకుండా, 2014 వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల్లో నడిచిందన్నారు. కరోనా కారణంగా ఈ పరిశ్రమతోపాటు ప్రపంచంలోని అనేక పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లాయని గుర్తుచేశారు.
 
కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం తలొగ్గకుండా విశాఖ ఉక్కును నిలబెట్టేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 100 కార్పొరేట్ కుటుంబులకు భారత రిజర్వు బ్యాంకు రూ.84,432 కోట్లను రుణంగా ఇవ్వగా, అందులో రూ.62 వేల కోట్లను ఆర్బీఐ రద్దు చేసిందని ఆర్.నారాయణ మూర్తి గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments