Webdunia - Bharat's app for daily news and videos

Install App

మస్తాన్ వలీ తెగ కొట్టేవాడు.. నీతు : స్మగ్లర్ బాలూనాయక్‌ ఖాతాకు రూ.లక్ష!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (17:26 IST)
ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి నీతూ అగర్వాల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ ఆంరంభమైంది. ఆమెను శనివారం రాత్రి హైదరాబాద్‌లో కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, స్మగ్లర్‌ బాలునాయక్‌ అకౌంటక్‌కు రూ.లక్ష బదిలీ చేసినట్టు నటి నీతూ అగర్వాల్‌ పోలీసులకు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్ వలీలో నీతూకు గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నీతుని ఆదివారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ను సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆధారాల తర్వాతే అరెస్టు చేసినట్లు చెప్పారు. నీతు అగర్వాల్ పోలీసులకు చిక్కగానే ఏడ్చింది. మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు కూడా వెక్కివెక్కి ఏడ్చింది. 
 
కాగా, పోలీసుల విచారణలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అతడి వేధింపులు తట్టుకోలేక తాను అతడికి లొంగిపోయానని, ఈ క్రమంలోనే ఆ రొంపిలోకి దిగవలసి వచ్చిందని చెప్పారు. 
 
మస్తాన్ వలీతో సంబంధాలు ఏర్పడ్డాక ఆమె తన కుటుంబానికి దూరమయ్యారు. నీతు అరెస్టైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు కర్నూలు వచ్చారు. ఇదిలావుండగా, స్మగ్లర్ బాలునాయక్ బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదలీ చేసినట్లు నీతు అగర్వాల్ పోలీసులకు చెప్పారు. ఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఉపయోగించిన కారును సీజ్ చేశారు. మస్తాన్ వలీ, నీతు అకౌంట్ల మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments