Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ రావడం లేదని నటి సంగీత అది తాగేసి ఆత్మహత్య యత్నం(వీడియో)

బెయిల్ రావడం లేదని తీవ్ర ఆవేదనకు గురైన రెడ్‌శాండిల్ క్వీన్‌, మహిళా స్మగ్లర్, మోడల్ సంగీతా చటర్జీ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చిత్తూరు సబ్ జైలులో ఉంటున్న ఆమె ఫినాయిల్ తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చి

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (16:56 IST)
బెయిల్ రావడం లేదని తీవ్ర ఆవేదనకు గురైన రెడ్‌శాండిల్ క్వీన్‌, మహిళా స్మగ్లర్, మోడల్ సంగీతా చటర్జీ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చిత్తూరు సబ్ జైలులో ఉంటున్న ఆమె ఫినాయిల్ తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెపుతున్నారు. 
 
కాగా, ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్లకు పడగలెత్తిన మహిళా స్మగ్లర్‌ సంగీతా చటర్జీని చిత్తూరు పోలీసులు గత యేడాది అరెస్టు చేసిన విషయం తెల్సిందే. కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. ఓ విమాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తూ, ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌కు దగ్గరైన సంగీత.. అక్రమ రవాణాలో అడుగుపెట్టింది.. ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు హవాలా ద్వారా సంగీత భారీగా నగదు మార్చింది. 
 
దీనిపై లోతుగా అన్వేషించిన చిత్తూరు పోలీసులు గత ఏడాది కోల్‌కతాలోని ఆమె నివాసంలో దాడులు చేశారు.. విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను తెరిపించి, నకిలీ తుపాకీ లైసెన్సులనూ స్వాధీనం చేసుకున్నారు. పలుసార్లు ఆమెను అరెస్టుచేయాలని పోలీసులు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అడ్డంకులు ఎదురయ్యాయి. 15 రోజులపాటు కోల్‌కతాలో రెక్కీ నిర్వహించిన పోలీసులు చివరకు సంగీతను అరెస్టు చేశారు. ఆమె ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రి పాలైన విజువల్స్... 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments