కరోనా సమయంలోనూ రేవ్ పార్టీలా...? వీళ్లు మారరా?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (10:52 IST)
rave party
కరోనా సమయంలోనూ రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. భౌతిక దూరం, స్వీయ రక్షణ మాత్రమే కరోనా నుంచి మనల్ని రక్షిస్తుందనే విషయం తెలిసిందే. అయితే యువత ఈ విషయాన్ని పక్కనబెట్టి రేవ్ పార్టీలకు హాజరవుతున్నారు. 
 
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రేవ్ పార్టీ జరగడం తీవ్ర కలకలం రేపింది. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 
 
ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఒకరు ఉక్రెయిన్ జాతీయురాలు కాగా, ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తి గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఓ రేవ్ పార్టీ నిర్వహించి పోలీసులకి చిక్కినట్లు తెలుస్తోంది. 
 
నిందితులపై కరోనా నిబంధనల ఉల్లంఘనల కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం. అలాగే వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం బయటకి రావడంతో కరోనా సమయంలో ఈ కక్కుర్తి ఏంటి అని చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments