Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇఫ్లూ: విద్యార్థినిపై సహ విద్యార్థులే అత్యాచారం!

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (12:30 IST)
ఇఫ్లూ విద్యార్థినిపై సహ విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థినిపై అత్యాచారం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే వర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి తన సహ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది.
 
24 గంటల తర్వాత ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.  
 
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని మంగలపల్లిలో శనివారం రాత్రి ఆరేళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రఫీక్ ఇంటిని ఆదివారం గ్రామస్థులు కూల్చేసి నిప్పంటించారు. 
 
గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆమనగల్లు పట్టణానికి వెళ్లి శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి పైన గంటన్నరపాటు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి నిందితుడి పైన నిర్భయ కేసును నమోదు చేసినట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments