Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లారితే పెళ్లి.. పెళ్ళికూతురిని చెరకుతోటలోకి ఎత్తుకెళ్లి... ఆపై దారుణంగా కొట్టి అత్యాచారం...

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తెల్లారితే పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఆమెను బలవతంగా ఎత్తుకెళ్ళిన ఓ యువకుడు.. కొట్టి అత్యాచారం జరిపారు. ఈ దారుణం వెస్ట్ గోదావరి

Webdunia
మంగళవారం, 30 మే 2017 (09:01 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తెల్లారితే పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఆమెను బలవతంగా ఎత్తుకెళ్ళిన ఓ యువకుడు.. కొట్టి అత్యాచారం జరిపారు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జ్లాల నిడదవోలు రూరల్‌ మండలం డి.ముప్పవరం గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
డి.ముప్పవరానికి చెందిన ఒక యువతికి (18) సమిశ్రగూడెం యువకుడితో సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి 10 గంటలకు బహిర్భూమికి వెళ్ళిన యువతిని అదేగ్రామానికి చెందిన మల్లిపూడి సత్యనారాయణ అనే యువకుడు మరికొందరి యువకుల సహాయంతో బలవంతంగా ఎత్తుకెళ్లాడు. గ్రామం సమీపంలోని చెరకుతోటలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెను దారుణంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే, పెళ్ళి మండపంలో పెళ్ళికుమార్తె కనిపించక పోవడంతో ఒక్కసారి కలకలం చెలరేగింది. అయితే సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆ యువతి గ్రామం సమీపంలోని చెరుకుతోటలో ఉన్నట్టు పశుకాపరులు గుర్తించారు. దీంతో వెంటనే వారు ఆమె బంధువులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులకు అపస్మారకస్థితిలో ఉన్న యువతి కన్పించింది. 
 
అదే ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడిన సత్యనారాయణ దాక్కుని ఉండగా గుర్తించారు. దీంతో బాధితురాలిని 108లో నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రిలోని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments