Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు దామరమడుగు వద్ద ఘోర ప్రమాదం : 8 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (11:37 IST)
నెల్లూరు జిల్లా దామరమడుగులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆథ్యాత్మిక పర్యటన ముగించుకుని వెళుతోన్న భక్త బృందం అనూహ్య రీతిలో అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువతాపడ్డారు. 
 
బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయరహరదారిపై ఆగివున్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టెంపోలో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. 
 
మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉ‍న్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. 
 
శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments