Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నాన్న భౌతికకాయంతో స్వగ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్... నేడు అంత్యక్రియలు

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (11:23 IST)
అనారోగ్య కారణంతో మృతి చెందిన తన చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతదేహంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఉదయం తమ స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకున్నారు. ఈ అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి, రామ్మూర్తి నాయుడు అన్న, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నారావారి పల్లెకు చేరుకుంటారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. 
 
కాగా, గత 15 యేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆదివారం ఉదయం తరలించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు తరలించారు. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలించారు. 
 
రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన మరో ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుని, తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు నారా, నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు తెలంగాణ నుంచి కూడా పలువురు నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments