మిస్టర్ పవన్.. వెన్నుపోటు ఖాయం.. బీ కేర్‌ఫుల్ విత్ నాదెండ్ల మనోహర్ : ఆర్జీవీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:43 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి, పవన్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఈయన్ను ఉద్దేశించి ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో వర్మ మరోమారు హాట్‌టాపిక్ అయ్యారు. 
 
తనకున్న అంతర్గత సమాచారం మేరకు ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌.. పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో మనోహర్ తండ్రిగారైన నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. అలాగే, నాదెండ్ల మనోహర్ కూడా అలా చేస్తారేమోనని తనకు ఆందోళనగా ఉందని ఆయన చెప్పారు. 
 
ఈ విషయాన్ని పవన్‌కు ఒక అభిమానిగా చెబుతున్నానని.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా అధినేతకు జాగ్రత్తలు సూచించాలని కోరారు. అయితే, వర్మ చేసిన ఈ కామెంట్స్‌ను పవన్ తేలిగ్గా తీసుకుంటున్నారు. తన దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాలోని 'వెన్నుపోటు' పాటను శుక్రవారం వర్మ విడుదల చేస్తున్నారు. ఆ పాటకు, సినిమాకు పబ్లిసిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా… ప్రజల్లో పేరున్న నాయకుడికి వెన్నుపోటు ప్రమాదం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments