Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ఎన్నికలు : టీడీపీ తరపున ముగ్గురు.. వైకాపా తరపున విజయిసాయి రెడ్డి ఏకగ్రీవం!

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం పార్టీ తరపున నాలుగో సీటుకు పోటీ పెట్టే యోచనను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరమించుకోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం పార్టీ తరపున నాలుగో సీటుకు పోటీ పెట్టే యోచనను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరమించుకోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. 
 
టీడీపీ-బీజేపీ కూటమి తరపున మూడు సీట్లకు ముగ్గురు అభ్యర్ధులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో సీటుకు వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి ఇప్పటికే నామినేషన్ వేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన సతీమణితో కూడా నామినేషన వేయించారు. అది డమ్మీ నామినేషన మాత్రమేనని, నామినేషన్ల పరిశీలన తర్వాత ఉపసంహరించుకుంటారని వైసీపీ నేతలు ప్రకటించారు. 
 
కాగా.. టీడీపీ, బీజేపీ అభ్యర్ధుల నామినేషన్ కార్యక్రమం అసెంబ్లీలో కోలాహలంగా జరిగింది. బీజేపీ తరపున రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు, తెలుగుదేశం పార్టీ తరపున కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి), మాజీ మంత్రి టీజీ వెంకటేశ నామినేషన్లు వేశారు. ముగ్గురు అభ్యర్ధుల నామినేషన పత్రాలపై మొదటి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments