Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల సెల్ఫీ సరదా.. ప్రాణాలు కోల్పోయిన కుమార్తె...

భార్యాభర్తల సెల్ఫీ సరదా చివరకు వారి ముద్దుల కుమార్తె ప్రాణాలు తీసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గంగానగర్ జిల్లా

Webdunia
సోమవారం, 14 మే 2018 (09:15 IST)
భార్యాభర్తల సెల్ఫీ సరదా చివరకు వారి ముద్దుల కుమార్తె ప్రాణాలు తీసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గంగానగర్ జిల్లాకు చెందిన దంపతులు తమ 10 నెలల చిన్నారికి హెల్త్ చెకప్ చేయించడం కోసం సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు.
 
అక్కడ అన్ని రకాల చెకప్‌లు పూర్తయిన తర్వాత సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. షాపింగ్ మాల్‌లోని ఎస్కలేటర్‌ ఎక్కిన తర్వాత సెల్ఫీలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో మహిళ ఎత్తుకున్న చిన్నారి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. ఎస్కలేటర్ రెయిలింగ్ ఢీకొని అక్కడికక్కడే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఇది ఆ షాపింగ్‌ మాల్‌లోని సీసీటీవీల్లో కెమెరాల్లో నమోదైంది. ఎస్కలేటర్‌పై ఉన్న సమయంలో ఆమె భర్త సెల్ఫీ అగడంతో సెల్ఫీ కోసం ప్రయత్నించి.. బ్యాలెన్స్ తప్పడంతోనే చిన్నారి ప్రాణం కోల్పోయిందని అక్కడ ఉన్నవారు తెలిపారు. ఆమె అజాగ్రత్తతోనే చిన్నారి ప్రాణం కోల్పోయిందని షాపింగ్ మాల్ నిర్వాహకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments