Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రాజమహేంద్రవరం -కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (08:52 IST)
రాజమహేంద్రవరం-కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు బుధవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఈ రూటులో సర్వీసులు మొత్తం నిలిచిపోయాయి.

ఇటీవల మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ పరిమిత సంఖ్యలో లోకల్‌ సర్వీసులు నడుపుతోంది. విజయవాడ, విశాఖపట్నం తదితర దూరప్రాంత రూట్లలోనూ ఒకటి, రెండు సర్వీసులు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం- కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఈ సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు.

ఇందులో భాగంగా కాకినాడకు రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఉదయం 5.30కు తొలి సర్వీసు, ఆఖరి సర్వీసు మధ్యాహ్నం 12.30కు బయలుదేరుతుంది. కాకినాడ డిపో నుంచి కూడా ఇదే సమయాల్లో రాజమహేంద్రవరంనకు నాన్‌స్టాప్‌ సర్వీసులు నడుస్తాయి. ప్రతి 40 నిమిషాలకు ఒకటి చొప్పున మొత్తం 12 సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments