Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలుకు సికింద్రాబాద్ స్టాప్ రద్దు!!

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (17:08 IST)
విశాఖపట్టణం - లింగంపల్లి - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలుకు సికింద్రాబాద్ స్టాపును రద్దు చేశారు. ఇది ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే (భారతీయ రైల్వే) అధికారులు వెల్లడించారు. ప్రతి రోజూ కొన్ని వేల మందిని గమ్యస్థానానికి చేరవేసే ఈ రైలును 25వ తేదీ నుంచి దారి మళ్లించారు. ఈ కారణంగా సికింద్రాబాద్ స్టాప్‌ను రద్దు చేశారు. 
 
ఇకపై ఈ రైలు చర్లపల్లి - అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ దారి మళ్లింపు కారణంగా ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ రైలు సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లదని, ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని రైల్వే శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరింది. 
 
మాట వినని విద్యార్థులు.. గుంజీలు తీసిన హెడ్మాస్టర్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం, పెంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల అందరి సమక్షంలో గుంజీలు తీశారు. విద్యార్థులు చెప్పిన మాట వినడం లేదని, విద్యార్థుల్లో విద్యా పురోగతి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంటూ ఆయన విద్యార్థుల సమక్షంలో గుంజీలు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకుండా, మాట వినని, సరిగా చదవని విద్యార్థులను దండించకుండా విద్యార్థుల సమక్షంలో తనను తాను శిక్షించుకున్న హెడ్మాస్టర్ చింత రమణను ఆయన ప్రత్యేకంగా అభినందింస్తూ ట్వీట్ చేశారు. 
 
ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ ఈ వీడియోను షేర్ చేస్తూ హెచ్‌ఎంను అభినందిస్తూ చేసిన ట్వీట్‌లో.. "పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడం లేదని, విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చింది. 
 
హెడ్మాస్టర్ గారూ... అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది. అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి, వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం'' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments