నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (21:12 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ డిప్యూడీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమన్నారు.
 
రఘురామ కృష్ణం రాజు మంగళవారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, "రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు" అన్నారు.
 
పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులకు జగన్ అండదండలు అందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు.
 
గతంలో తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు, జగనే తనను కస్టడీలో కొట్టించారని రఘురామ సంచలన ఆరోపణ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ను చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేమని ఆయన అన్నారు. 
 
"నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైసీపీ నేతల అదృష్టం" అంటూ రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments