Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ పదవి కోసం పయ్యావుల.. గాలి పోటాపోటీ!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (11:42 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడులది విచిత్రమై పరిస్థితి. వీరిద్దరూ అసెంబ్లీలో ఉంటే టీడీపీ అధికారంలో ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. వీరిద్దరు అసెంబ్లీలో ఉండరు. ఇది అనుభవపూర్వకంగా నిరూపితమైంది. అయితే, ఈ ఇద్దరు నేతలు కూడా మంచి వాక్చాతుర్యం కలిగిన నేతలు. గత ప్రభుత్వాల పనితీరును అసెంబ్లీలో ఎండగట్టడంలో కీలక పాత్ర వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే వీరిద్దరూ మంత్రులవుతారని అందరూ భావించారు. 
 
అయితే, కథ అడ్డం తిరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ.. వీరిద్దరు మాత్రం ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టలేక పోయారు. ఈ ఇద్దరు నేతలూ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముద్దుకృష్ణమ నాయుడు మాట ఎలా ఉన్నా కేశవ్‌ను ఎమ్మెల్సీగా చేసి చంద్రబాబు మంత్రిని చేస్తారని తెలుగుదేశం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో చూడాల్సివుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments