Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం నుంచి పోటీపై పురంధేశ్వరి.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఏమన్నారు?

వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బీజేపీ నేత పురంధేశ్వ‌రి పోటీ చేయనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో రాజ‌కీయంగా త‌న భ‌విష్య‌త్‌ కార్యాచ‌ర‌ణ గురించి పురంధేశ్వ‌రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ప్ర‌త్య

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (12:31 IST)
వచ్చే ఎన్నికల్లో  హిందూపురం నుంచి బీజేపీ నేత పురంధేశ్వ‌రి పోటీ చేయనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో రాజ‌కీయంగా త‌న భ‌విష్య‌త్‌ కార్యాచ‌ర‌ణ గురించి  పురంధేశ్వ‌రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ప్ర‌త్యేకంగా హిందూపురం నుంచి పోటీ చేయాల‌ని పార్టీ కేడ‌ర్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావ‌డం లేద‌న్నారు. అయితే పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. 
 
రాష్ట్రంలో అన్ని స్థానాలకు పార్టీ కేడ‌ర్ త‌న‌ను ఆహ్వానిస్తోంద‌ని.. అలాంటప్పుడు ఇలాంటి పుకార్లు ఎలా పుడుతాయో తెలియట్లేదన్నారు. ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ‌కు ద‌త్త‌పుత్రుడి లాంటి వార‌ని ఆమె పేర్కొన్నారు. 
 
అలాగే ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్త‌క‌మ‌ని, సినిమా తీస్తే ఆయ‌న గౌర‌వాన్ని పెంచేలా ఉండాలి గానీ ఒక్క కోణంలో సినిమా తీయాల‌నుకోవ‌డం స‌బ‌బు కాద‌ని పురంధేశ్వ‌రి అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీయ‌నున్న ''ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'' సినిమాపై ఆమె స్పందించారు.
 
ఆంధ్రుల‌కు ఆత్మ‌గౌర‌వం అంటే ఏంటో అర్థం చెప్పిన వ్య‌క్తి నంద‌మూరి తార‌క‌రామారావు అని గ‌తంలో రామ్ గోపాల్ వ‌ర్మ అన్న మాట‌ల‌ను ఆమె గుర్తు చేశారు. అలాంటి మ‌హానీయుడిని బ‌జారుకీడ్చొద్ద‌ని ఆమె ఆర్జీవీని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments