Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుంగనూరు అల్లర్లు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదనీ...

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:09 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన సందర్బంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. వీరిలో కొందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరికొందరికి ఇంకా బెయిల్ రాలేదు. దీంతో తన కుమారుడికి బెయిల్ రాలేదన్న మనస్తాపంతో ఓ నిందితుడి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఇరికిపెంటలో సోమవారం జరిగింది. గ్రామ సర్పంచి శ్రీనివాసులు నాయుడు అల్లర్ల కేసులో అరెస్టయి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీకా ఉన్నారు. ఈ కేసులోని నిందితుల్లో 50 మందికి బెయిల్ వచ్చింది. కానీ, శ్రీనివాసులు నాయుడికి మాత్రం బెయిల్ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికు గురైన అతని తల్లి రాజమ్మ తెలియని ద్రావకం ఏదో తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments