Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీకామ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్-జలీల్‌కు‌‌ తోడుగా రామాంజనేయులు.. 20 సంవత్సరాలు బువ్వ తినలేదట.. ఓన్లీ పాలే?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజల నోళ్ళల్లో నానుతున్నారు. మొన్నటికి మొన్న బీకామ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందంటూ జలీల్ ఖాన్ అనే ఎమ్మెల్యే వ్య

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:00 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజల నోళ్ళల్లో నానుతున్నారు. మొన్నటికి మొన్న బీకామ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందంటూ జలీల్ ఖాన్ అనే ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీకామ్‌లో ఏ సబ్జెక్టు వుంటుందో కూడా తెలియని వ్యక్తి ఎలా ఎమ్మెల్యే అయ్యారని పలువురు విమర్శలు గుప్పించారు. మరికొందరు నవ్వుకున్నారు. అయినా.. సదరు ఎమ్మెల్యే మాత్రం ఏం జరగనట్లు వుండిపోయారు. 
 
తాజాగా టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే.. 20ఏళ్ల పాటు భోజనమే చేయలేదని.. వట్టి పాలు మాత్రమే తాగానని చెప్తూ చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. తాను పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ల వయస్సు వచ్చేదాకా అన్నం తినలేదని.. మానేశానని.. అసలు అన్నం ఎలా తినాలో తెలియదన్నట్లు కామెంట్స్ చేశారు. ఓన్లీ పాలు మాత్రమే తాగి పెరిగానని చెప్పారు. 
 
20 సంవత్సరాలకు తర్వాత అన్నం ఎందుకు తిన్నానంటే..? అది కూడా పెళ్లి వల్లే అంటున్నారు.. భీమవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పలుపర్తి రామాంజనేయులు. అన్నం తినకపోతే.. పెళ్లికాదని ఎవరో చెప్తే భయపడి భోజనం చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాత్రిపూట పాలు మాత్రమే తాగుతున్నానని రామాంజనేయులు చెప్పారు. రామాంజనేయులు కామెంట్స్‌పై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments