Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీ గేమ్: గన్ కొనేందుకు రూ. 3 లక్షలు ఇవ్వనందుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (16:38 IST)
పబ్జీ గేమ్‌ను ఎప్పుడో నిషేధించారు కదా.. ఇంకా ఈ గేమ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా. పబ్జీ గేమ్‌ను పాత లింక్‌ల సహాయంతో ఓపెన్ చేసి ఇప్పటికీ చాలామంది యువకులు ఆడుతూనే ఉన్నారు. పబ్జీ గేమ్‌కు బానిసలుగా మారిపోయారు. వ్యసనపరులుగా మారి ప్రతిరోజు అదే గేమ్ ఆడుతున్నారు.
 
అయితే ఆన్‌లైన్‌లో ఈ గేమ్ కాస్త బాగా పాపులర్ అవ్వడమే కాదు, గేమ్‌లో మరింత లోతుగా వెళ్ళాలంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అలా ఆడుతున్న ఒక యువకుడు గన్‌ను కొనడానికి 3 లక్షలు కావాలంటే తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. ఇవ్వనని చెప్పినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.
 
తిరుపతి రూరల్ బిటీ నగర్‌కు చెందిన తేజోష్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఇంటి వద్దే ఉంటున్నాడు. తండ్రి భాస్కర్ టిటిడిలో ఉద్యోగి. ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. క్లాసులు లేకపోవడం.. ఆన్ లైన్ క్లాసులను పట్టించుకోకుండా పబ్జీ ఆడుతూనే కాలం వెళ్లదీస్తున్నాడు తేజోష్.
 
అయితే గత రెండురోజుల నుంచి పబ్జీ గేమ్‌లో చివరి దశకు చేరుకోవడం, శత్రువులను చంపడానికి గన్ కొనాలని ఆన్ లైన్‌లో ఉండటంతో అందుకు 3 లక్షల రూపాయలు కావాలని తండ్రిని ప్రాధేయపడ్డాడు. గేమ్ ఆడుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తండ్రి మందలించాడు.
 
దీంతో మనస్థాపానికి గురయ్యాడు తేజోష్. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో తండ్రి విధులకు వెళ్ళగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే బెడ్రూం లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. తేజోష్ మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments