Webdunia - Bharat's app for daily news and videos

Install App

‌పబ్‌జీ గేమ్‌ వల్ల యువకుడు పిచ్చోడైపోయాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (14:20 IST)
పబ్‌జీ గేమ్‌కు బానిసలైపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ గేమ్‌తో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ను అదేపనిగా ఆడితే ఎంతగా నష్టపోతామో తెలిపే మరో ఘటన విశాఖలో చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌కు బానిసై అదేపనిగా ఆడడం వల్ల ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు. విశాఖలోని అరకులోయ ప్రాంతానికి చెందిన కౌశిక్‌ అనే యువకుడు పదేపదే పబ్జీ గేమ్‌ ఆడేవాడు. 
 
ఇటీవల ఆ గేమ్‌ ఆడుతోన్న సమయంలో ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి అతడు వెళ్లిపోయాడని వైద్యులు తెలిపారు. బాధితుడికి చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 
 
పబ్జీ గేమ్‌ వల్ల అతడు మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. ప్రస్తుతం దీంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అతడికి వైద్యులు ప్రథమ చికిత్సచేసిన అనంతరం... పబ్జీ గేమ్‌ వల్ల అతడు మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. 
 
అతడిని చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని సూచించారు. అయితే పబ్ జీ ఆటలో లీనమైన వీరంతా తాము ఏం చేస్తున్నామన్న విషయం కూడా గమనించలేదని పోలీసులు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments