Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం కావాల్సిందే... హైకోర్టు ఆదేశం

Webdunia
బుధవారం, 20 మే 2020 (12:38 IST)
డాక్టర్ సుధాకర్ పట్ల వైకాపా ప్రభుత్వంతో పాటు విశాఖ పోలీసులు ప్రవర్తించిన తీరుపట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సుధాకర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకుని గురువారం సాయంత్రంలోగా తమకు అందజేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టులు ఉత్తర్వులు జారీచేసింది. 
 
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ సీఎం జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసే విషయంలో ఎన్95 రకం మాస్కులుగానీ, పీపీఈ కిట్లుగానీ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. దీంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 
 
ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై ఆయన గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం అలజడి రేపింది. ఆ తర్వాత సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదంటూ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. అయితే, సుధాకర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... సుధాకర్‌ను తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. అలాగే, ఆయన వాంగ్మూలాన్ని గురువారం సాయంత్రంలోగా తమకు అందజేయాలని ఉత్తర్వులు జారీచేస్తూ, కేసు విచారణను శుక్రవారానికి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments